. . . లయన్ పోలవరపు బసవేశ్వర రావు
రుద్రూర్, బతుకమ్మ :
ఉచిత మధుమేహ పరీక్ష కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ పోలవరపు బసవేశ్వర రావు పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 7:00 గంటల నుండి 7:30 నిమిషాల వరకు ఉచిత మధుమేహ పరీక్షల కేంద్రాన్ని బస్టాండ్ ముందు గల మహేశ్వరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ కంటి ఆసుపత్రుల వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ గవర్నర్, జిఎంటి ఎండి320 లయన్ పోలవరపు బసవేశ్వర రావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లయన్స్ జిల్లా 320 డి లో 130 పైచిలుకు క్లబ్ లు ఉండగా ఇందులో నాలుగు ఐదు క్లబ్ లు మాత్రమే ప్రతిరోజు మధుమేహ పరీక్షలు చేస్తారన్నారు. ఇందులో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారు ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించడం రుద్రూర్ గ్రామ ప్రజలకు గర్వకారణం అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు ఉచితంగా మధుమేహ పరీక్షలు చేయడానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి తన వంతు సహాయంగా ముఖ్య అతిథి 5000 రూపాయలను క్లబ్ అధ్యక్షులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జిఈటి కోఆర్డినేటర్ లయన్ పల్లెంపాటి శ్రీధర్, రీజియన్ చైర్మన్ లయన్ తన్నీరు సుబ్బారావు, జోన్ చైర్మన్ లయన్ గణపురం అశోక్, స్టేట్ జిఎస్టి కోఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడే, జిల్లా అధ్యక్షులు లయన్ కెవి మోహన్, క్లబ్ అధ్యక్షులు లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, కార్యదర్శి లయన్ గెంటిల గంగాధర్, కోశాధికారి లయన్ పార్వతీ ప్రశాంత్, వ్యవస్థాపక సభ్యులు లయన్ పత్తి రాము, క్లబ్ క్లబ్ డైరెక్టర్లు, సభ్యులు లయన్స్ పుట్టి సాగర్, ఎండి శామీర్, ఒరికే సతీష్, డాక్టర్ మల్లేష్, భోజుగొండ అనిల్, బచ్చు శ్రావణ్ గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
