. . . 30 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఆబా కార్డుకు అర్హులు
. . . ఐదు లక్షల ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి
. . . ఏఎన్ఎం శారద
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మాన్ పల్లి సబ్ సెంటర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ అథారిటీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అబా) కార్డును 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్డు పొందడం ద్వారా ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సేకరించడం జరుగుతుందని ఏఎన్ఎం శారద తెలిపారు. అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల ఇంటింటికి తిరుగుతూ మురికి నీరు నిల్వ ఉండకుండా, ఇంట్లో బయట వాకిట్లో శుభ్రతను పాటించాలని ఆశ వర్కర్ జ్యోతి అన్నారు. ప్రస్తుతం వేసవి కాలం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫ్రైడే గ్రేడే సందర్భంగా ఆశ వర్కర్ ప్రతి ఇంటికి తిరిగి శుభ్రతను పాటించాలని అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శారద, సెకండ్ ఏఎన్ఎం భానుప్రియ ఆశ వర్కర్లు పాశం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
