Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 5:28 pm Posted by : ramakrishna

శాంతి భద్రతలు కాపాడడంలో ప్రజలు సహకరించాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ : శాంతి భద్రతలు కాపాడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో కోరారు. నిజామాబాద్ ప్రజలు నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలన్నారు.   ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాలలో విగ్రహ ప్రతిష్టలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.  రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ డీజేలు పూర్తిగా నిషేధం అని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని,  డ్రోన్స్ ఉపయోగించడానికి, భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై అప్రమత్తంగా ఉండండాలని తెలిపారు. ఈ నిబంధనలు ఈనెల 1నుంచి 15తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.