Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 8:26 pm Posted by : ramakrishna

శాంతి ర్యాలీకి ప్రజలు భారీగా తరలిరావాలి

 

. . . మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శనివారం శాంతి ర్యాలీ చేపట్టారు. గత కొంత కాలంగా అన్ని వర్గాలు ఒకటేనన్న నినాదంతో ధర్మపురి సంజయ్ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ చేసిన నినాదం ఫలితాన్నిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కలయిక వెనుక ధర్మపురి సంజయ్ కృషి ఎంతగానో ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే శనివారం చేపట్టిన శాంతి ర్యాలీకి భారీగా తరలి వచ్చి విజయవంతం చేసి ఐక్యతను చాటుకోవాలని ధర్మపురి సంజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మన శాంతి మన బాధ్యత అనే నినాదంతో శాంతి ర్యాలీకి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 28న జిల్లా కేంద్రంలో ని గాంధీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. కులమతాలకు అతీతంగా జరిగే ఈ ర్యాలీలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నేడు కులమత ఘర్షణలతో రాజకీయ పార్టీలు లబ్ది పొందాలని చూస్తున్నాయన్నారు. సర్వేజనో సుఖినోభవంతు, మేరా భారత్ మహాన్, హిందూ, ముస్తిం, సిఖ్, సిపాయి ఆపాస్ యే భాయ్ భాయ్ నినాదాలు చేస్తూ ముందుకు సాగాలన్నారు. గతంలో దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ చేసిన అభివృద్ధినే తాను కోరుకుంటున్నానని, అలాంటి అభివృద్ధి జరగాలంటే కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యమంగా ముందుకు సాగాలన్నారు. తాను చేపట్టిన భృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని నిజామాబాద్ ప్రజలను ధర్మపురి సంజయ్ కోరారు.