సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రుద్రూర్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన రుద్రూర్, బతుకమ్మ : సైబర్, ఆన్ లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాబృందం వారు తెలియజేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో సోమవారం రాత్రి రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా...