Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 5:31 pm Posted by : ramakrishna

అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 

జుక్కల్, బతుకమ్మ:  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  కార్యకర్తలకు సూచించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట యార్డులో శనివారం నిర్వహించిన  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు. బిచ్కుంద మండలంలోని గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని అన్నారు.ఈ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

People should be made aware of development works