Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 5:56 pm Posted by : ramakrishna

వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండండి

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని, చేపల వేటకు వెళ్ళరాదని, తగు జాగ్రత్తలు పాటించాలని తహసిల్దార్ రాజా నరేందర్ గౌడ్ తెలిపారు. సిమెంటు స్తంభాల వద్ద జాగ్రత్త ఉండి కరెంటు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. రైతులు పంట పొలాల్లో స్టార్టర్ వద్దకు వర్షాలు పడితే వెళ్ళకూడదు అని ఆయన తెలిపారు. మరిన్ని అతి భారీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు.