హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్
బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం పరిధిలోగల రాంపూర్.గౌరారం గ్రామాలలో పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ ఏ రాజు ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో రెండు గ్రామాలలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు ప్రజలకు తెలియజేశారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని దానికి గ్రామస్తులు కూడా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మీకు లాటరీ వచ్చిందని మీరు డబ్బులు కట్టాలని మీ నుండి ఓటీపీని తీసుకొని నేరగాళ్లు మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తాన్ని కాజేస్తారని అలాగే బస్సులలో ప్రయాణించేటప్పుడు సెల్ ఫోన్లు గాని బంగారు వస్తువులు గాని డబ్బులు గానీ జాగ్రత్తగా ఉంచుకొని నేరగల పారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఎవరైనా గ్రామంలో కొత్తవారు సంచరించినట్టు అనిపిస్తే అనుమానం వచ్చిన వెంటనే పిట్లం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి తెలియజేయాలని వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్. కానిస్టేబుల్ రవిచంద్ర గౌడ్. కానిస్టేబుల్ వెంకా గౌడ్. నాగరాజు తదితరులుపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.