భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బతుకమ్మ నిజామాబాద్ సిటీ : గత కొన్ని రోజుల నుండి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, రానున్న ఐదు రోజులు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ...