భారీ వర్షాలు నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తప్పనిసరి అయితే తప్ప, దయచేసి బయటికి వెళ్లకండి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లోద్దని ఆయన కోరారు.గడిచిన నాలుగేండ్లుగా బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసినందున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో...