- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
రుద్రూర్, బతుకమ్మ: గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. శనివారం రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద గుండ్ల వాగు లో లెవల్ బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటి ఉద్రిక్తతను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, నీటి కుంటల వద్దకు వెళ్ళరాదని ఆయన సూచించారు. సిపి వెంట ఏసిపి శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.