భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి    బాన్సువాడ, బతుకమ్మ :  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇంట్లో, వంతెనలపై, వరద ప్రవాహం ఉన్న రోడ్లపై ప్రయాణం చేయవద్దన్నారు.తెగిపడిన విద్యుత్ తీగలు, కరెంటు స్తంభాలు...