కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రుద్రూర్ ఎస్సై సాయన్న రుద్రూర్, బతుకమ్మ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే గుండ్ల వాగు వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని శుక్రవారం ఎస్సై సాయన్న తన సిబ్బందితో సందర్శించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహించే అవకాశం ఉందన్నారు. కావున రుద్రూర్- బొప్పాపూర్ మార్గానికి రాకపోకలు నిలిపివేసి, వేరే మార్గం గుండా రాకపోకలు కొనసాగించేలా చర్యలు చేపడతామన్నారు. అలాగే...