పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి
. . . సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ, బతుకమ్మ : పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండలంలోని బోర్లం గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా వెంటనే తొలగించాలని సబ్ కలెక్టర్ సూచించారు. అలాగే మురుగునీటి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చి పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలని అధికారులను...