హైదరాబాద్, బతుకమ్మ :
దీపావళి సంబరాల వేళ ఉదయాన్నే కంటి ఆసుపత్రులకు జనం క్యూ కట్టారు. హైదరాబాద్ లోని పలు కంటి ఆస్పత్రులలో దీపావళి కారణంగా కళ్ళు దెబ్బతిని ఇబ్బందులు పడ్డ ప్రజలు హాస్పిటల్ కి వెళుతున్నారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్ సరోజినీ కంటి ఆసుపత్రుల్లోనే ఉదయం 9 గంటల లోపల 30 మంది కంటి గాయాలతో చికిత్స చేయించుకున్నారు వారిలో ఎనిమిది మంది ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అయ్యారు. ఇలా పలు ఆసుపత్రుల్లో కూడా కంటి ఇబ్బందులతో ప్రజలు చికిత్సకు పోతున్నారు . దీపావళి టపాకాయలు పేల్చే సమయంలో కంటికి తగిన జాగ్రత్త తీసుకోవాలని దూరంగా ఉండి కాల్చాలని ప్రతి ఏడాది ప్రభుత్వాలు సామాజిక సేవా సంస్థలు ఇంట్లో పెద్దలు చెప్తూనే ఉన్నప్పటికీ పరిస్థితి మారదు . కంటి గాయాలైన వారిలో యువకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.