ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. చక్రపాణి
మెండోరా, బతుకమ్మ : గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరుతోందని శ్రీరాం సాగర్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. చక్రపాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.