లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మద్నూర్, బతుకమ్మ: డోంగ్లి మండలంలోని ఇటు మంజీరా నది అటు లేండి వాగు పరివాహ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డోంగ్లి మండల ఆర్ ఐ సాయిబాబా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొరలు పొంగుతుండడంతో డోంగ్లి మండలంలోని పలు గ్రామాలను మండల తాసిల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ సందర్శించి సమీక్షించారు లేండి నది, నిజాంసాగర్ కెనాల్ ప్రాజెక్టు భారీగా నీరు వదిలుతున్నారు. మండలంలోని చిన్న టాక్లి ,నుండి పెద్ద టాక్లి, వెళ్లే...