బతుకమ్మ, భిక్కనూరు: అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య అన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య మాట్లాడుతూ ప్రతి నెల చివరి తేదీ నాడు నిర్వహించే సివిల్ రైట్స్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులందరూ కులాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని, కులంతో దూషించకుండా సమానత్వం అనే భావనతో ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఏఎస్ఐ జగదీశ్వర్ గణేష్ శ్రీరామ్ పంచాయతీ కార్యదర్శి భార్గవి, మాజీ సర్పంచ్ మధు మోహాన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.