Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 6:29 pm Posted by : ramakrishna

ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు

 

. . . ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 

. . . సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై మెమొరాండం అందజేత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో మురికి కాలువలలో చెత్త పేరుకుపోయి, వాటి వల్ల దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయని, దాని వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని సీపీఎం నగర కార్యదర్శి బి. సుజాత అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సమస్యలపై కలెక్టర్ ఆఫీసులో మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య నగర్ లో 80 క్వార్టర్స్, టైలర్స్ కాలనీ, 300 క్వార్టర్స్ లలో మంచి నీరు మురికి నీరు లా వస్తుందన్నారు. అంతే కాకుండా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. దాని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలని పరిష్కరించాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సంగీత, లక్ష్మీబాయి, పంచ పూల సరుభాయ్, యశోద, రజియా, తదితరులు పాల్గొన్నారు.