Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 7:02 pm Posted by : ramakrishna

మూఢ నమ్మకాల వల్ల ప్రజలు మోసపోతున్నారు

 

. . . జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మూఢనమ్మకాల వల్ల ప్రజలు, విద్యావంతులు మోసపోతున్నారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొని మూఢనమ్మకాలు నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది జనవిజ్ఞాన వేదిక వారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజిరెడ్డి కి, కార్యదర్శి బుగ్గారెడ్డి కి జన విజ్ఞాన వేదిక వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా జనవిజ్ఞాన వేదిక కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

People are being deceived due to superstitions.