Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 5:07 pm Posted by : ramakrishna

పెన్షనర్ ల బకాయిలను ఏక కాలంలో చెల్లించాలి

 

. . . పీఆర్ టియు జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

2024 తర్వాత రిటైర్ అయిన పెన్షనర్ ల బకాయిలను ఏక కాలంలో చెల్లించాలని పీఆర్ టియు జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతన పిఆర్ సి రిపోర్ట్ తెప్పించుకొని జులై 1, 2023 నుండి అమలు చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలు చేస్తూ నగదు రహిత చికిత్స అందించేలా హెల్త్ కార్డులు విడుదల చేయాలని అన్నారు. అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పెండింగ్ 5 డీఏ లను వెంటనే మంజూరు చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.