పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 20 24 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం పెన్షనర్స్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా ఇవ్వటం లేదని దీని మూలంగా రిటైర్ అయిన ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రిటైర్...