మంత్రివర్గంలో జిల్లాకు మొండి చేయి
పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నాయకులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మచ్చలేని నాయకుడు పి.సుదర్శన్ రెడ్డికి చోటు లేకపోవడం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసినట్లేనని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నాయకులు అన్నారు. పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి మొండి చేయి చూపించటం దారుణమని...