- పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మచ్చలేని నాయకుడు పి.సుదర్శన్ రెడ్డికి చోటు లేకపోవడం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసినట్లేనని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నాయకులు అన్నారు. పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి మొండి చేయి చూపించటం దారుణమని అన్నారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం లేకపోవడం వివక్షతతో కూడినటువంటిదని ఆరోపించారు. మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అమలుకు మైనారిటీ మంత్రి ఉండటం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. సామాజిక సమీకరణాల పేరుతో ఉమ్మడి నిజాంబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని, అ సమీకరణాల లో భాగంగా ముస్లిం మైనారిటీలకు ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు. పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కే. రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు ఎండి హమీదద్దీన్, సాంబశివరావు , నరేందర్, బాలదుర్గయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.