- రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బన్సీలాల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మార్కెటింగ్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బన్సీలాల్ డిమాండ్ చేశారు. తెలంగాణలోని వివిధ మార్కెటింగ్ కమిటీ శాఖ లోని రిటైర్డ్ ఉద్యోగులకు ఈరోజు వరకు పెన్షన్లు జమ కాలేదని అన్నారు. ఇదే విధంగా నెలల తరబడి పెన్షన్లు పెండింగ్లో ఉంటున్నాయని, మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన డబ్బు కొట్టాది రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం నెలనెలా పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలిపారు. మార్కెటింగ్ కమిటీ ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని, నెల, నెలా పెన్షన్ను ట్రెజరీ నుండి చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజేందర్, నాయకులు పూర్ణచంద్ర రావు ,బాలయ్య, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.