Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 6:44 pm Posted by : ramakrishna

పెండింగ్ పనులను వెంటనే పూర్తి చెయ్యాలి

జడ్పి సీఈఓ బి. ఉషా
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో జరుగుతున్న ప్రభుత్వ పనుల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని వెంటనే పూర్తి చెయ్యాలని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. ఉషా మండల ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం సీఈఓ భీమ్ గల్ మండల పరిషత్ ఆఫీస్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ ఆఫీస్ కు సంబంధించి రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా సీ ఈ ఓ మాట్లాడుతూ 15 వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చెయ్యాలని సూచించారు. అనంతరం మండలంలోని బాబాపూర్ గ్రామ పల్లె ప్రకృతి వనంను ఆమె సందర్శించారు. తదానంతరం మండలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ లింబాద్రి గుట్ట లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి సూపరిండెంట్ శ్రీనివాస్ రావు, సీనియర్ అసిస్టెంట్ నవీన్, ఎంపిడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ జావీద్ అలీ, సూపరిండెంట్ భీమయ్య, సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్, ఉపాధి ఏపీఓ జి. నర్సయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.