పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ సిబ్బందికి పెండింగులో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని, కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టళ్ళల్లో పనిచేస్తున్ననాన్ టీచింగ్, వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు...