- తెలంగాణ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ట్రైకార్ చైర్మెన్ డా. బెల్లయ్య నాయక్ తేజవత్
నిజామాబాద్, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న స్కిం లను వెంటనే గ్రౌడింగ్ చేయాలని తెలంగాణ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ ట్రైకార్ చైర్మెన్ డా. బెల్లయ్య నాయక్ తేజవత్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో గురువారం ట్రైకార్, ఈఎస్ఎస్, సీఎం గిరివికాసం, ఎంఎస్ఎంఈ పథకాల లక్ష్యాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానికంగా గిరిజనులకు ఏ యూనిట్లు కావాలో వాటి జాబితా తయారు చేసి పంపాలని అన్నారు. అనంతరం డిచ్ పల్లి మండలంలోని నాకతాండకు చెందిన భుక్య నౌషకు గిరిజనులకు సీఎంఎస్టీ ఎంటర్ ప్రైనర్షిప్ కింద మంజూరైన రూ.72లక్షల విలువగల డెయిరీ యూనిట్ ను, చందమామా గిరిజన ఆసుపత్రిని సందర్శించారు. వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు (రెవెన్యు), జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
