పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను చెల్లించాలి

మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ నిజామాబాద్, బతుకమ్మ  : నగరంలో  రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణాలను బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ సందర్శించారు.  పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను చెల్లించాలని ఆయన దుకాణాదారులకు సూచించారు. పన్ను చెల్లించని దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఈఈ మురళి రెడ్డి, వార్డ్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఉన్నారు.