Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 6:20 pm Posted by : ramakrishna

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

  • ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేనీ (ముజీబ్) అధ్యక్షతన నాంపల్లిలోని టిఎన్జీవో కేంద్ర కార్యాలయంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సమావేశాయని ఆయన హాజరై మాట్లాడారు. టీఎన్జీవో సంఘం ఆవిర్భవించి 80 వసంతాలు గడిచిన సందర్భంగా త్వరలోఎల్బీ స్టేడియం నందు లక్ష మంది ఉద్యోగులతో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి  రాష్ట్ర సీఎం, మంత్రివర్గ సభ్యులు హాజరవుతారని తెలిపారు.  ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగుల ఐక్యతను చాటాలని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో రాష్ట్ర నాయకత్వం తీసుకోబోతున్న ఉద్యమ కార్యచరణకు జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ పాల్గొన్నారు.