Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 12:22 pm Posted by : ramakrishna

ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

 

… శంకర్ భవన్ పాఠశాల ఉపాధ్యాయుల నిరసన

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన చేశారు.  తెలంగాణ ఎంప్లాయి జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయుల నిరసన తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు పిఆర్సి వెంటనే ప్రకటించాలని టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ సురేష్ డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న ఉపాధ్యాయులు గోపి మల్లేశం రాములు, రాజయ్య, రమేష్, మాధవి, శ్రీలక్ష్మి, శాంతాబాయి, రజిని, పావని తదితరులు పాల్గొన్నారు.