పెండింగ్ ఫీజు రియింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సుమారు ఏడు వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ అధ్యక్షతన శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియాంబర్స్మెంట్ పై ఆధారపడి డిగ్రీ , పీజీ, ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులు...