పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి రూ. 8000 వేల కోట్ల ఫీజు రీయిం బర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతుందన్నారు. ప్రయివేట్ విద్యాసంస్థల యజమాన్యాలు జీతాలు ఇవ్వలేక ,బిల్డింగ్ రెంటులు కట్టలేని పరిస్థితుల్లో కాలేజీల...