Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 2:40 pm Posted by : ramakrishna

పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ :  ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్  నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి రూ. 8000 వేల కోట్ల  ఫీజు రీయిం బర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతుందన్నారు.  ప్రయివేట్ విద్యాసంస్థల యజమాన్యాలు జీతాలు ఇవ్వలేక ,బిల్డింగ్ రెంటులు కట్టలేని పరిస్థితుల్లో  కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు.  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకోసారి విద్యాసంస్థల యజమాన్యాలను  పిలిచి చర్చలు జరపాలని కోరారు. వెంటనే   ఫీజు  రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని లేనిచో, రాష్ట్ర వ్యాప్త  ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్  నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, జిల్లా ఉపాధ్యక్షుడు సుభొద్, నాయకులు రమేష్, దినేష్, అంజి,  విద్యార్థులు పాల్గొన్నారు.