టీ పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్
బతుకమ్మ పిట్లం : రాష్ట్ర ప్రభుత్వ ,ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఐదు డిఏ లను వెంటనే చెల్లించాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడారు.సమస్యల సేకరణ సభ్యత్వ క్యాంపెన్లో భాగంగా పిట్లం మండలంలో పిట్లం మార్తాండ హస్నాపూర్,కంబాపూర్,గోధుమేగాం కరేగాం,చిన్న కోడపుగాల్ తదితర పాఠశాలను సందర్శించి, సమస్యలను సేకరించి ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ,ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరిని వినడాలని, రావలసిన ఐదు పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2018 నుండి అమలు చేయాల్సిన పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని ,రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఉపాధ్యాయ ,ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సాంక్షన్ అయిన స్కావెంజర్ నిధుల్ని వెంటనే సంబంధిత పాఠశాలల అకౌంట్లో వేయాలని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు నష్టం చేకూర్చే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు వెంటనే చేకూర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు.ప్రైమరీ పాఠశాల పదివేల ప్రధానోపాధ్యాయుల పోస్టులను వెంటనే మంజూరు చేస్తూ, ఎస్జిటి ఉపాధ్యాయులకు అందరికీ ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు లేకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే ఉపాధ్యాయులకు ఉచిత వైద్య పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన లక్షలాది రూపాయల పెండింగ్ బిల్లుల్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. సంవత్సర కాలం నుండి జిపిఎఫ్ లోన్స్ , మెడికల్ బిల్స్, గ్రాడ్యుటి పెన్షన్ సంబంధించిన డబ్బులు అన్నిటి కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు రిటైర్ కాగానే రావాల్సిన సౌలాభ్యాలు అన్నీ వెంటనే చెల్లించాలని, మూడు సంవత్సరాల బాండ్ లేదా ఆలస్యంగా డబ్బులు రిలీజ్ చేయడం మూలంగా తీవ్రంగా నష్టపోతున్నారని, కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి,రాష్ట్ర కౌన్సిలర్ డాక్టర్ నాగభూషణం,జిల్లా ఉపాధ్యక్షులు టి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగం కృష్ణ శ్రీధర్ ,రాజ శేఖర్,రమేష్,తదితరులు పాల్గొన్నారు