- టిపిటిఎఫ్ అధ్యక్షులు వెని గళ్ల సురేష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ల సురేష్ డిమాండ్ చేశారు. టిపిటిఎఫ్ జిల్లా కమిటీ సమావేశం శనివారం టీఎన్జీవోస్ భవన్ లో అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, డి ఎ బకాయిలను కూడా వెంటనే ఆమోదించి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపవిద్యాశాఖ అధికారులను వెంటనే నియమించాలని, డైట్ బిఈడి కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్స్ స్కేల్ వెంటనే ఇయ్యాలని, రెసిడెన్షియల్ పాఠశాలలన్నీ కూడా సాధారణ పాఠశాల సమయాన్నిపాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని ఎస్జిటి ఉపాధ్యాయులతో వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, వైద్య బిల్లులను కూడా ఆపడం శోచనీయమని డిమాండ్ చేశారు. టిపిటిఎఫ్ బలపరిచిన అభ్యర్థి వై.అశోక్ కుమార్ ను ఎమ్మెల్సీగా గెలిపించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చందర్ అరవింద్ హలీం, మల్కన్నా జిల్లా కార్యదర్శి మల్లేశం గంగా ప్రసాద్ నగేష్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
