Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2025, 5:24 pm Posted by : ramakrishna

పెగడపల్లి మాజీ సర్పంచ్ కుటుంబం మానవతా సేవా

 

బోధన్, బతుకమ్మ  :

అనారోగ్యంతో ఇబ్బందులు  ఎదుర్కొంటున్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మాజీ సర్పంచ్ కుటుంబం తమ సేవా నిరతిని చాటుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి .నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి కుటుంబం అనారోగ్యంతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. పోశెట్టి, ఆయన భార్య , కుమారుడు సాయిలు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడటం తో చికిత్స కోసం అవసరమైన ఖర్చులు సమకూర్చుకునే స్థోమత లేక జీవనం క్లిష్టంగా మారింది.

ఈ విషయం తెలిసిన గ్రామ మాజీ సర్పంచ్ మద్ది సాయిలు కుమారుడు మద్ది అశోక్, తన కుటుంబ సభ్యులతో కలిసి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి, బాధిత కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. సాయిలు కుటుంబ స్థితిని గమనించి గ్రామస్థులు మెరుగైన వైద్యం కోసం అందరూ కలిసికట్టుగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.సహాయం చేయడానికి ఆసక్తి ఉన్న వారు జల గిరి సంజీవ్ 90595 95825 ను సంప్రదించాలని కోరారు.