Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 8:53 pm Posted by : ramakrishna

టీఎన్జీవో గౌరవ అధ్యక్షులుగా పెద్దోళ్ళ నాగరాజు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా గౌరవధ్యక్షులుగా పెద్దోళ్ళ నాగరాజు నియమితులయ్యారు. హైదరాబాద్ లోని టీఎన్జీవో కేంద్ర కమిటీ కార్యాలయంలో నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అధ్యక్షులుగా సుమన్, గౌరవధ్యక్షులుగా పెద్దోళ్ల నాగరాజును ఎన్నుకున్నారు. పెద్దోళ్ళ నాగరాజు ప్రస్తుతం టీఎన్జీవో ఉపాధ్యక్షులుగా పని చేశారు. టీఎన్జీవో అనుబంధ వైద్య ఆరోగ్యశాఖాధ్యులుగా పని చేశారు. 1998 నుంచి టీఎన్జీవోలో పని చేస్తున్నారు. జిల్లా గౌరవధ్యక్షులుగా నియమితులైన పెద్దోళ్ల నాగరాజు తనను నియమించిన కేంద్ర కమిటీ బాధ్యులకు, రాష్ట్ర బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Peddolla Nagaraju as Honorary President of TNGO