23న పెద్ద పోచమ్మ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణ 16వ వార్డులోని పెద్ద పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహా లక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించింది. కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారీ, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్ (బుజ్జి) మాట్లాడుతూ, మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21వ తేదీన దేవత ఊరేగింపు, గోపూజ, 22న హోమం, 23న...