Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 5:10 pm Posted by : ramakrishna

23న పెద్ద పోచమ్మ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణ 16వ వార్డులోని పెద్ద పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహా లక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించింది. కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారీ, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్ (బుజ్జి) మాట్లాడుతూ, మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21వ తేదీన దేవత ఊరేగింపు, గోపూజ, 22న హోమం, 23న యంత్ర, శిఖర, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ హాజరవుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారీ, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు సంగ్రామ్, పోశెట్టి, బాలకృష్ణ, మారుతి మందిరం మాజీ చైర్మన్ గుండెడి శంకర్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.