Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:07 pm Posted by : ramakrishna

శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :

 

వర్ని మండల కేంద్రంలోని జాకోరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైడిమల్ బ్రాంచి కొకల్ దాస్ తండా గ్రామంలో ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఎంసి వర్ని చైర్మన్ సురేష్ బాబా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు శనగలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ దశరథ్, మాజీ జెడ్పిటిసి హరిదాసు, సర్పంచులు అనూష చిరంజీవి, గీత  సీతారాం, ఎన్ గంగారం, జి.శ్రీనివాస్, ఉప సర్పంచులు కిషన్, మాదాస్, రాజేష్, నాయకులు అబ్దుల్ బారి, శనిగరం కిషన్, నరేడ్ల చిన్న సాయిలు, మాజీ ఎంపిటిసి సాయిలు, మాజీ సర్పంచ్ దేవేందర్ తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.