Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2025, 2:18 pm Posted by : ramakrishna

బాన్సువాడ డివిజన్‌లో ప్రశాంతంగా పోలింగ్

బాన్సువాడ, బతుకమ్మ  : టీచర్స్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బాన్సువాడ డివిజన్ లో ప్రశాంతంగా కొనసాగుతోంది. బాన్సువాడ, బీర్కూర్ మండలంలో పట్టభద్రుల పోలింగ్ మధ్యాహ్నం సమాయానికి 35.34 శాతం నమోదు కాగా, డివిజన్ లోని  బాన్సువాడ, బీర్కూర్, నస్రూల్లాబాద్, నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద,జుక్కల్, పెద్దకొడప్  గల్, డోంగ్లి, పిట్లం మండలాల్లో ఉపాధ్యాయుల పోలింగ్ 48.55 శాతం నమోదైందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. బాన్సువాడ డివిజన్ కేంద్రం తో పాటు అన్ని మండల కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. ఓటింగ్‌ వివరాలను ఆరా తీశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట మహమ్మద్‌ నగర్‌ తహసీల్దార్‌ సవాయిసింగ్, ఆర్‌ఐ పండరి, నిజామ్ సాగర్‌ తహసీల్దార్‌ భిక్షపతి, ఆర్‌ఐ సాయిబాబా ఉన్నారు.

Peaceful polling in Bansuwada division