ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా బీసీ బంద్
నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిసి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు పెట్రోల్ బంక్ లు వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసి ఉంచారు. ఆర్టీసీ బస్టాండ్ ల, డిపో ల వద్ద బిసి సంఘాలు శనివారం తెల్లవారుజామున ఆందోళన చేపట్టారు. రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల తో పాటు కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ ల సాధనకు చేపట్టిన బంద్ కు అధికార కాంగ్రెస్ పార్టీ,...