సాయుధ దళాల కృషితోనే ప్రశాంత వాతావరణం
నిజామాబాద్, బతుకమ్మ: దేశ రక్షణ కోసం సాయుధ దళాల చేస్తున్న కృషితోనే ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, వారి త్యాగాలను ప్రతి పౌరుడూ గుర్తించి సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం...