Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 6:33 pm Posted by : ramakrishna

శాంతి, ప్రేమ, సహనం ఆచరణీయం

  • సిఎస్ఐ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
  • హాజరైన నుడా చైర్మన్ కేశ వేణు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏసు ప్రభువు బోధనలు ఆయన చూపిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనమనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ ఆచరణీయమని సిఎస్ఐ చర్చ్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ అన్నారు. ఈ మేరకు బుధవారం క్రిస్మస్ను పురస్కరించుకొని సి ఎస్ ఐ చర్చి ఆవరణంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలను చేశారు. ఒకరినొకరు కలుసుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.చర్చిలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఏసుప్రభు బోధనలను ఫాదర్లు వినిపించగా ఆలకించారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చ్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ మాట్లాడుతూ..యేసు క్రీస్తు పుట్టిన రోజును ప్రపంచ ప్రజలు జరుపుకునే ప్రత్యేకమైన పండుగని, యేసు క్రీస్తు పుట్టిన రోజు ప్రజలందరికీ సంతోషం కలగజేసే ప్రపంచ పండగ అని అన్నారు.

Peace, love and tolerance are viable

నుడా చైర్మన్ కేశవేణు క్రిస్మస్ వేడుకల సందర్భంగా మొదటి సర్వీస్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రేమ భావాన్ని, సేవా, క్షమా గుణాన్ని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినం క్రైస్తవులకు పవిత్ర దినంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంతోషక రంగా నిర్వహిం చుకునే పండుగ క్రిస్మస్ అని తెలియజేశారు. ఏసుక్రీస్తు సూచించిన మంచి మార్గంలో ప్రజలు నడవాలని సుఖ సంతోషాలతో జీవించాలని కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని సూచించారు. అందుకే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బోధ చేశారు. అనంతరం సి ఎస్ ఐ చర్చి పాస్టర్లు, చర్చి కమిటీ సభ్యులు, నుడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రత్నాకర్ లు కలిసి చర్చ్ ఆవరణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ పాస్టర్లు రెవరెండ్ ప్రకాష్, రెవరెండ్ కృపాకర్, పాస్టరేట్ సెక్రటరీ సుధీర్ ప్రకాష రావు, పాస్టరేట్ స్టీవార్డ్ జయప్రసాద్, పాస్టర్ ఎయిట్ ట్రెజరర్ పవన్ కుమార్, పాస్టరేట్ ప్రాపర్టీ సెక్రటరీ సంజు జార్జ్, పాస్టర్ రేట్ ఉమెన్ సెక్రటరీ మేరీ జార్జ్, పాస్టర్ ఎయిట్ యూత్ సెక్రటరీ ప్రసన్న కుమార్, చర్చ్ స్టీవార్డ్ ప్రశాంత్ వినోద్ కుమార్, పాస్టరేట్ సండే స్కూల్ సెక్రటరీ రవి జవన్ తోపాటు చర్చి కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరీ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

Peace, love and tolerance are viable