Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 7:17 pm Posted by : ramakrishna

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం

బతుకమ్మ, బోధన్: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా శనివారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో  శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్ బాబు, ఎస్ఐ మచ్చందర్ రెడ్డి  ఆధ్వర్యంలో  కమిటీ సభ్యులతో వివిధ అంశాలపై చర్చించారు. సమాజంలో శాంతి యుత వాతావరణం నెలకొల్పడంలో ప్రజల పాత్ర ఎంత ముఖ్యమో అధికారలు వివరించారు. రానున్న పండుగల సమయంలో పరస్పర అవగాహనతో, శాంతి భద్రతలకు భంగం కలగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  శాంతియుత వాతావరణం లో పండగలను జరుపుకోవాలని సూచించారు. పోలీస్ విభాగం ఎల్లప్పుడూ ప్రజల భద్రతకోసం సిద్ధంగా ఉంటుందని, ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరారు.

Peace Committee meeting at Bodhan Rural Police Station