పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్నిక

నిజామబాద్ సిటీ,  బతుకమ్మ : పీడీఎస్యూ ఉపాధ్యక్షులుగా ఎం.నరేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా డాక్టర్ కర్క గణేష్ ఎంపికయ్యారు. రాష్ర్ట జనరల్ కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 4, 5 తేదీలలో భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నిర్వహించారు.  ఈ  జనరల్ కౌన్సిల్లో నిజామబాద్ జిల్లాకు చెందిన ఎం. నరేందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, డాక్టర్ కర్క గణేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్.కే. అషుర్, ఎల్. అనిల్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో  కేంద్ర, రాష్ట్ర...