Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2025, 5:26 pm Posted by : ramakrishna

పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్నిక

నిజామబాద్ సిటీ,  బతుకమ్మ : పీడీఎస్యూ ఉపాధ్యక్షులుగా ఎం.నరేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా డాక్టర్ కర్క గణేష్ ఎంపికయ్యారు. రాష్ర్ట జనరల్ కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 4, 5 తేదీలలో భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నిర్వహించారు.  ఈ  జనరల్ కౌన్సిల్లో నిజామబాద్ జిల్లాకు చెందిన ఎం. నరేందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, డాక్టర్ కర్క గణేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్.కే. అషుర్, ఎల్. అనిల్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించాలని, స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం, ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, అందరికీ సమాన విద్య కొరకై, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకం గా విద్యా పోరాటాలు నిర్మించాలని అనేక తీర్మానాలు చేశామని తెలిపారు.