బోధన్, బతుకమ్మ : గోదాంలో అక్రమంగా నిల్వఉంచిన పీడీఎస్ బియ్యాన్ని గురువారం పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భోదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనిసనగర్ లోని గోదాంపై టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో దాడి చేసి 2.5టన్నలు పీడీఎస్ బియ్యం పట్టకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యం విలువ సుమారు రూ.80వేలు ఉంటుందన్నారు. గోదాం యజమానిని అరెస్ట్ చేసి తదుపరి చర్య నిమిత్తం భోదన్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.