బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో అక్రమ పిడిఎస్ బియ్యం మంగళవారం భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బుగ్గ శ్రీనివాస్ అనే వ్యక్తి పిడిఎస్ రైస్ బియ్యం తక్కువ ధర కొనుక్కొని వాటిని తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని డిటి ఎర్రం కిష్టయ్య పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు బుక్క శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 4. 83 కిలోల బియ్యాన్ని సీజ్ చేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరంధాములు, రాజా గౌడ్, అశోక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.